బంట్వారం : నేడు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో సకల సౌకర్యాలు కల్పిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీడీవో డేనియల్ పేర్కొన్నారు. శుక్రవారం కోట్పల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాలు పుస్తకాలు, దుస్తులు మధ్యాహ్న భోజనం అన్ని సౌకర్యాలతో విద్యను అందిస్తున్నామని తెలిపారు. అహ్లాదకరమైన వాతావరణంలో క్రీడా పోటీలు సైతం నిర్వస్తున్నామని తెలిపారు.
మండల విద్యాధికారి చంద్రప్ప మాట్లాడుతూ బయట ఉన్న పిల్లల్ని బడిలో చేర్పించాల్సిందిగా గ్రామ విద్యార్థుల తల్లిదండ్రులు స్థానిక పాఠశాల సిబ్బంది ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గ్రామస్తులు సహకరిస్తేనే ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు అవకాశం ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో సంగయ్య స్వామి, నక్కల బొందయ్య. చంద్రశేఖర్, ఉమాదేవి, ఎంపీవో సురేందర్ రెడ్డి, కార్యదర్శి అనంత రాజిరెడ్డి, ఉపాధ్యాయులు, యాదవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.