హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): రాజ్యసభలో బీఆర్ఎస్ పార్లమెంటరీ డిప్యూటీ లీడర్‌గా ఎంపీ వద్దిరాజు రవిచంద్రను, విప్‌గా ఎంపీ దీవకొండ దామోదర్‌రావును పార్టీ అధినేత కేసీఆర్ నియమించారు. ఈ మేరకు ఆయన పార్లమెంట్ సెక్రటరీ జనరల్‌కు లేఖ రాశారు. పార్లమెంటరీ పార్టీనేతగా ఇటీవలే ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి నియమితులు కావడం తెలిసిందే. కాగా, పార్లమెంటరీ పార్టీ ఉపనేతగా, విప్‌గా నియమించినందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ దిశానిర్దేశానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు పార్లమెంట్ వేదికగా తమ శక్తియుక్తులను వినియోగిస్తామని పేర్కొన్నారు.