వినియోగదారులకు సత్వర సేవలు అందించాలి
పెట్రోలియం, సహజవాయువు వినియోగదారులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన సేవలను అందించాల్సిన అవసరం ఉన్నదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్థాయీ సంఘం అధ్యయన యాత్రలో భాగంగా ముంబైలో నిర్వహించిన రెండో రోజు సమావేశానికి శనివారం ఆయన హాజరయ్యారు .
- ఫిర్యాదులు తక్షణమే పరిషరించాలి
- ముంబైలో పార్లమెంటరీ స్థాయీ సంఘం సమీక్షలో బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు
హైదరాబాద్, ఆగస్టు 22, (నమస్తే తెలంగాణ): పెట్రోలియం, సహజవాయువు వినియోగదారులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన సేవలను అందించాల్సిన అవసరం ఉన్నదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్థాయీ సంఘం అధ్యయన యాత్రలో భాగంగా ముంబైలో నిర్వహించిన రెండో రోజు సమావేశానికి శనివారం ఆయన హాజరయ్యారు . స్థాయీ సంఘం చైర్మన్ సునీల్ దత్తాత్రే తరరే అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పెట్రోల్, డీజిల్, సహజవాయువు రంగాల పనితీరు, వినియోగదారులకు అందుతున్న సేవలపై అధికారులతో విసృ్తతంగా చర్చించారు.
ఈ సందర్భంగా వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, సత్వర పరిషారం చూపాలని కోరుతూ సమావేశంలో కీలక సూచనలు చేశారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ప్రోత్సహించే సతాట్ పథకం అమలుపై పెట్రోలియం, ఆర్థిక శాఖల అధికారులు, బ్యాంకింగ్ ప్రతినిధులతో సమీక్షించారు. కంప్రెస్డ్ బయో గ్యాస్ (సీబీజీ) ప్రాజెక్టుల ఏర్పాటుకు తగిన రుణ సౌకర్యాలు కల్పించడంపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెట్రోలియం, సహజవాయువు రంగాల్లో ప్రైవేట్ వ్యాపారుల పాత్ర, పురోగతిపై స్థాయీ సంఘం సభ్యులు ప్రత్యేకంగా సమీక్షించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

