బోయినపల్లి రూరల్, సెప్టెంబర్ 16: రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వెంటనే కన్నెపల్లి పంప్‌హౌస్ మోటర్లను ఆన్‌చేసి పంటలను కాపాడాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభు త్వం మొద్దునిద్ర వీడటం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా నిరంతరాయంగా కరెం ట్ సరఫరా చేసి, మర్లపేట వద్ద పంపులను ఆన్‌చేసి విలాసాగర్ చెరువు నింపాలని, లేదంటే రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ పెద్ద చెరువు నింపాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు, రైతులతో కలిసి మర్లపేట వరద కాలువ బ్రిడ్జి వద్ద వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు పంప్‌హౌస్ వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సుంకె మాట్లాడుతూ.. నాడు వరద కాలువ తమ వ్యవసాయ భూముల పకనుంచే వెళ్లినా.. చుకనీరు లేక రైతులు ఇబ్బందులుపడ్డారని తెలిపారు.