న్యూఢిల్లీ : షెహ్జాద్ భట్టీ నెట్వర్క్ను ఉపా చట్టం కింద భారత్ బుధవారం ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. సరిహద్దుల్లో ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మత్తు మందులను అక్రమ రవాణా చేయడం, నిర్భాగ్యులను ఉగ్రవాదంలోకి చేర్చుకోవడం,
భారత ప్రజాస్వామ్య నిర్మాణం, సామాజిక సామరస్యతపై దాడి చేస్తున్నారనే కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నది.