హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సోమవారం ఢిల్లీలోని రైల్ నిలయంలో రైల్వేబోర్డు చైర్మన్ సతీశ్‌కుమార్‌తో భేటీ అయ్యారు. ఖమ్మం జిల్లాలో రైల్వేస్టేషన్ల ఆధునీకరణ, కొత్త ప్లాట్‌ఫారాల ఏర్పాటు, కొవిడ్‌కు ముందు రద్దుచేసిన రైళ్ల పునరుద్ధరణ, అదనపు హాల్టింగ్ పాయింట్లు, కొ త్త రైల్వే సర్వీసుల ప్రారంభం తదితర సమస్యలపై ఆయనకు వినతిపత్రం అందజేశారు. ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని చైర్మన్ హామీ ఇచ్చారని వద్దిరాజు వెల్లడించారు.