హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ సభకు పలువురు నేతలు గైర్హాజరు కావడంపై బీజేపీలో చర్చ జరుగుతున్నది. ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎంపీలు విజయశాంతి, ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హాజరు కాలేదు. రాష్ట్రంలోని ముఖ్య నాయకులందరూ హాజరైన ఈ సభకు వీరు మాత్రమే ఎందుకు రాలేదన్నది రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.