హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జీ సంతోష్‌కుమార్ ఆదివారం గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొన్నారు. వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఇవాళ ఉదయం హన్మకొండ జిల్లాలో కొలువైన ఐనవోలు మల్లికార్జునస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‌విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.