హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): బిగ్‌బాస్.. తెలుగు రాష్ర్టాల్లో విశేష ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షో. ఇది నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తిచేసుకోగా, ఐదో సీజన్ కూడా చివరి అంకానికి చేరుకొన్నది. ఈ షో శనివారానికి 97వ రోజు పూర్తి చేసుకొన్నది. కాగా, ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోకు ముఖ్యఅతిథిగా గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, ఎంపీ సంతోష్‌కుమార్ హాజరుకానున్నారు. బిగ్‌బాస్-5లో 98వ రోజైన ఆదివారం ఆయన హాజరయ్యే ఎపిసోడ్ ప్రసారం కానున్నట్టు సమాచారం.