హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): వికారాబాద్ అడవిలో 150 ఏండ్ల క్రితం నాటి మామిడి చెట్టును గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ సందర్శించారు. ప్రకృతి ప్రేమికుడిగా ఈ చెట్టును చూడటం మరచిపోలేని అనుభూతిని ఇచ్చిందని పేర్కొన్నారు.
ఈ చెట్టుకు సంబంధించిన ఫొటోలను ఎక్స్ (ట్విటర్)లో శుక్రవారం పోస్ట్ చేశారు. ఇలాంటి సంపదను కాపాడుకుందామని, భావితరాలకు వారసత్వంగా అందిద్దామని సంతోష్‌కుమార్ ట్వీట్ చేశారు.