హైదరాబాద్, నమస్తే తెలంగాణ : తన కెమెరా కన్నులతో ప్రకృతి అందాలను.. ముఖ్యంగా పక్షులను బందించే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ఈసారి విభిన్నమైన చిత్రాలను ఎక్స్(ట్విట్టర్) వేదికలో షేర్చేశారు.
ఇటీవల వికారాబాద్ అడవుల్లో తనకు కనిపించిన సాలెగూడు(స్పైడర్ వెబ్), ఎనిమిది కాళ్ల సాలీడు ఫొటోలను ఆదివారం షేర్ చేశారు. ప్రకృతిలో కనిపించే అందంలో ఇది మరో అద్భుతమని పేర్కొన్నారు.