మియాపూర్, మార్చి 6: విజన్ ఉన్న నాయకుడు మంత్రి కేటీఆర్ అని, ఆయన దూరదృష్టితో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సమస్యలతో ప్రజలు గగ్గోలు పెట్టగా కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తున్నదని చెప్పారు. సోమవారం ఆయన శేరిలింగంపల్లి లోని ఆల్విన్ కాలనీ డివిజన్లో విప్ అరికెపుడి గాంధీ, కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్‌గౌడ్‌తో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. పాదయాత్ర సందర్భంగా ప్రజల నుంచి లభిస్తున్న స్వాగతం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధికి నిదర్శనమని చెప్పారు. ఏండ్ల తరబడి ముంపుతో సతమతమైన కాలనీలను ఆ సమస్య నుంచి శాశ్వత పరిష్కారం చూపిన ఘనత బీఆర్ఎస్ సర్కార్‌దేనని స్పష్టం చేశారు.