సరస్వతీ పుత్రుడికి చేవెళ్ల ఎంపీ బాసట

ఐఐఎం సీటు సాధించిన గిరిజన విద్యార్థికి రూ. లక్ష సాయం
బషీరాబాద్, జూన్ 8 : తెలంగాణ గురుకులంలో చదువుకొని ఇండియన్ ఇన్ట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో సీటు సాధించి, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వికారాబాద్ జిల్లా కొర్విచేడ్తండాకు చెందిన గిరిజన విద్యార్థి నరేష్‌కు చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి బాసటగా నిలిచారు. నమస్తే తెలంగాణ ప్రధాన సంచికలో వచ్చిన ‘ఐఐఎంలో మెరిసిన గిరిపుత్రుడు’ కథనానికి స్పందించిన చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి మంగళవారం విద్యార్థికి లక్ష ఆర్థిక సాయాన్ని అందించారు. చదువుకు పేదరికం అడ్డు కాకూడదంటూ మనోధైర్యాన్ని ఇచ్చారు. తల్లిదండ్రులను కూలీ పనులు మాన్పించి ఇంట్లో కూర్చోబెట్టి సేవ చేసినప్పుడే నిజమైన విజయం సాధించినట్టని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఏ సాయం కావాలన్న తనని సంప్రదించవచ్చని నరేశ్‌కు సూచించారు. ఈ సందర్భంగా ఎంపీకి నరేష్ కృతజ్ఞతలు తెలిపాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

