రవీంద్రభారతి, నవంబర్ 22: ‘కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని రెండేండ్లుగా నమ్మబలికిన కాంగ్రెస్ సర్కారు.. చివరకు బీసీలను నట్టేట ముంచింది’ అని ఎంపీ, బీసీ జాక్ చైర్మన్ ఆర్ కృష్ణయ్య, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభు త్వం జీవో46ను విడుదల చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి మొత్తంగా 50 శాతంలోపే రిజర్వేషన్లను ఖరారు చేస్తూ స్థానిక ఎన్నికలకు మార్గదర్శకాలు ప్రకటించడం బీసీలను దగా చేయడమేనని ధ్వజమెత్తారు.
జీవో 46ను ఉపసంహరించుకోవాలని లేకుంటే బీసీలం తా ఐక్య ఉద్యమాలకు సిద్ధమవుతామని హె చ్చరించారు. ప్రభుత్వం దిగిరాకుంటే భవిష్య త్తు కార్యచరణను రెండురోజుల్లో ప్రకటిస్తామని తేల్చి చెప్పారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్లో శనివారం వారు మీడియాతో మాట్లాడారు. హైకోర్టు గడువు కు ముందే, వాదనలు వినిపించకుండానే ప్ర భుత్వం ముందస్తుగా జీవో 46ను విడుదల చేసి బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. దీనికి కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
సామాజిక-రాజకీయ పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేయాల్సిన సమయంలో.. గదుల్లో కూర్చొని నివేదికలు సిద్ధం చేయడం ద్వారా బీసీలకు రాజకీయ అవకాశాలు దెబ్బతీశారని విమర్శించారు. హెచ్చరించారు. 20న డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా జీవో 46 నిర్ణయాలు తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించిందని, మరి ఆ నివేదికకు క్యాబినెట్ ఆమోదం ఉన్న దా? అని వకుళాభరణం కృష్ణమోహన్‌రావు ప్రశ్నించారు. గతంలో అదే కమిషన్ నివేదిక ఆధారంగా బిల్లులు రూపొందించి చట్టసభలు ఆమోదించగా, ఇప్పుడు మళ్లీ కొత్త నివేదిక అవసరం ఎందుకు ఏర్పడింది? అని నిలదీశారు. సమావేశంలో బీసీ నేతలు కొం డపాక దేవయ్య, బాలయ్య పాల్గొన్నారు.
హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు సంస్థల్లో పదోన్నతులను సమీక్షించి, నష్టపోయిన బీసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని బీసీ సంక్షేమసం ఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. 1999 నుంచి నియమించబడిన ఉద్యోగుల సీనియారిటీ, మెరిట్ ప్రాతిపదికన సమీక్షించి పదోన్నతులు ఇవ్వాలని కోరారు. శనివారం మింట్ కంపౌండ్‌లోని తెలంగాణ విద్యుత్తు బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. విద్యుత్తు సంస్థల్లో 50% డైరెక్టర్ పోస్టుల్లో బీసీలకు అవకాశం కల్పించాలని, స్థానికసంస్థల్లో చట్టబద్ధంగా 42% రిజర్వేషన్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. 20వేల మంది ఆర్టిజన్లను రెగ్యులరైజ్‌చేయాలని, విద్యుత్తు సంస్థల్లో పీఆర్సీని వర్తింపజేయాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం అధ్యక్షుడు కోడెపాక కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్నగౌడ్ తదితరులు పాల్గొన్నారు.