హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాల ఆదాయం ఆధారంగా నియోజవర్గాల పునర్విభజన చేపట్టాలనే సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. ఈ మేరకు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ప్రతిపాదన కాంగ్రెస్ అధికారిక విధానామా? అనే విషయంపై రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే నోరు విప్పాలని డిమాండ్ చేశారు.
ఓటు అందరికీ సమానంగా ఉండాలన్నదే రాజ్యాంగ స్ఫూర్తి అని గుర్తు చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా జీఎస్డీపీ ఆధారంగా సీట్లు కేటాయించాలనడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. డీలిమిటేషన్‌ను ప్రశ్నిస్తున్న రేవంత్‌రెడ్డి.. జీహెచ్ఎంసీని ఏ ప్రాతిపాదికన మూడు ముక్కలు చేశారో? చెప్పాలని డిమాండ్ చేశారు.