రేపు నల్లగొండలో రేవంత్ రెడ్డి సమీక్ష.. తాను వెళ్లడంలేదన్న ఎంపీ కోమటి రెడ్డి
Komatireddy Venkat reddy | తెలంగాణ కాంగ్రెస్లో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కార్యక్రమానికి తాను హాజరుకావడం లేదని భునగిరి ఎంపీ, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat reddy) స్పష్టం చేశారు.
నల్లగొండ: తెలంగాణ కాంగ్రెస్లో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కార్యక్రమానికి తాను హాజరుకావడం లేదని భునగిరి ఎంపీ, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat reddy) స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి శుక్రవారం నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నల్లగొండలో పార్టీ పరిస్థితులపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి తాను వెళ్లడం లేదని ఎంపీ కోమటి రెడ్డి ప్రకటించారు.
తన సొంత నియోజకవర్గంలో కేంద్రమంత్రి గడ్కరీ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయని, తాను వాటిలో పాల్గొన్నాల్సి ఉన్నదని చెప్పారు. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పటిష్టంగా ఉందని వేరే నేత వచ్చి సమీక్ష జరపాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్న దగ్గర సమీక్షలు పెట్టుకుంటే మంచిదని సలహా ఇచ్చానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు సాధారణమేనని వెల్లడించారు. పార్టీ మారే ఉద్దేశం తనకు లేదని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

