రాజన్న సిరిసిల్ల : జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ కె. కేశవ రావు(MP Keshav Rao ) బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.