జడ్చర్ల, సెప్టెంబర్ 4: కాంగ్రెస్‌లోని అంతర్గత రాజకీయ విభేదాలే మంత్రి కొండా సురేఖ బర్తరఫ్కు దారి తీశాయని భావిస్తున్నట్టు పాలమూరు ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఆమె హాజరై మాట్లాడారు.
2009లో కొండా సురేఖతోపాటు కలిసి మంత్రులుగా పనిచేశామని గుర్తుచేశారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ, సీఎం ఎంతో చేశామని గొప్పలు చెప్పుకొంటున్నారన్నారు.. కానీ ఒక బీసీ మహిళ, ఆమె కూతురు ఏదో మాట్లాడిందని సురేఖ మీద యాక్షన్ తీసుకోవడం సమర్థనీయం కాదన్నారు. ఆమెను బీజేపీలోకి ఆహ్వానించే చర్యలు ఏవీ జరుగలేదని పేర్కొన్నారు.