హైదరాబాద్, నవంబర్ 3(నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి పాలన మేడిపండు చందంగా ఉన్నదని, ప్రజలను గ్యారెంటీల పేరిట నమ్మించి వంచించారని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ధ్వజమెత్తారు. ప్రధాని మోదీపై సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదిక గా చేసిన విమర్శలకు ఘాటుగా బదులిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఏ రాష్ట్రంలోనూ అమలు చేయలేదని, అందుకే హర్యానాలో ప్రజలు నమ్మలేదని విమర్శించారు.
రుణమాఫీ, రైతుభరోసా, కౌలు రైతులు, కూలీల కు రూ.12వేలు, యువతకు నిరుద్యో గ భృతి, 2లక్షల ఉద్యోగాలు, ఎలక్ట్రిక్ సూటీలు, కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం, పింఛన్ల పెంపు ఇలా ఇచ్చిన హామీలన్నీ బోగస్ అయ్యాయని నిప్పులు చెరిగారు. హామీల అమలు చేతకాని సీఎం రేవంత్‌కు ప్రధాని మోదీని విమర్శించే నైతిక హక్కులేదని మండిపడ్డారు.