యాదాద్రి భువవనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాజ్య సభ సభ్యుడు దివకొండ దామోదర్ రావు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. బుధవారం రాత్రి యాదాద్రికి చేరుకున్న ఎంపీ తెల్లవారుజామున స్వామి వారి నిజాభిషేకంలో పాల్గొని ప్రత్యేక పూజాలు నిర్వహించారు.
ఉదయం 9 గంటలకు ఆలయ ప్రాకార మండపంలో జరిగిన సుదర్శన నరసింహ హోమంలో ఎంపీ సతీమణి, కుమారుడు, కూతురు, కోడలు, అల్లుడు పాల్గొన్నారు. హోమం ముగిసిన అనంతరం స్వయంభూ నరదింహుడిని కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు జరిగిన సువర్ణ పుష్పార్చనలో పాల్గొన్నారు.