హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 10 (నమస్తే తెలంగాణ): మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో మీనాక్షీనటరాజన్ నామినేషన్ తిరస్కరణ తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. నామినేషన్ తిరస్కరణ వెనుక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుట్ర కోణం దాగి ఉన్నదంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారంటూ బుధవారం సీసీఎస్ పోలీసులకు భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ‘తెలుగు స్ర్కైబ్’ యూట్యూబ్ చానల్ మీద సైబర్‌క్రైమ్‌లో ఫిర్యాదు చేసిన ఎంపీ చామల.. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని పోలీసులను కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రతిష్ట, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా తెలుగు స్ర్కైబ్ వ్యవహరించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, ఈ అంశంపై పలు మీడియాసంస్థలు కాంగ్రెస్ నుంచే బీజేపీకి లీకులు వెళ్లాయని వార్తలు రాశాయి. అంతేకాకుండా, కాంగ్రెస్ నుంచే తమకు ఆమెపై ఉన్న కేసుల సమాచారం వచ్చిందని మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్, బీజేపీ నేత బీఎల్ సంతోష్ వంటి నేతలు బహిరంగంగా విమర్శిస్తున్నారు