వీర శైవులను బీసీల్లో చేర్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే : ఎంపీ బీబీ పాటిల్
సిద్దిపేట : వీర శైవులను బీసీల్లో చేర్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని.. ప్రభుత్వంలో బలిజలకు రాజకీయాల్లో సైతం ప్రాధాన్యత ఇస్తున్నారని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. ఆదివారం సిద్ధిపేట రెడ్డి ఫంక్షన్ హాల్లో వీరశైవ బలిజ సమాజ మహాసభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీశ్ రావు, జహీరాబాద్ ఏంపీ బీబీ పాటిల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ పాటిల్ మాట్లాడుతూ.. ఏదైనా అడిగితే లేదనుకుండా ఇచ్చే మంచి మనసున్న వ్యక్తి మంత్రి హరీశ్‌రావు అన్నారు.
మీ ప్రేమ ఎప్పటికి ఇలాగే ఉండాలన్నారు. సిద్ధిపేటను మంత్రి అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారన్నారు. భవిష్యత్‌లోనూ మరింత అభివృద్ధి చేస్తారని స్పష్టం చేశారు. అంతకు ముందు డీసీఏంఎస్ చైర్మన్ శివకుమార్ మాట్లాడుతూ ప్రభ్యుత్వ పరంగా బసవేశ్వర జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నారని తెలిపారు.
వీరశైవ బలిజ సమాజం బీఆర్ఎస్కు అండగా ఉంటుందన్నారు. ఈ మహాసభలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, వీర శైవ ప్రతినిధులు శివప్ప, ప్రశాంత్, భద్రప్ప, అశోక్, యాదగిరి, శివకుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.