జగిత్యాల, జూలై 28 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే 42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లునుపెట్టి, 9వ షెడ్యూల్లో చేర్చేలా చర్యలు చేపట్టాలని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సీనియర్ నా యకుడు బోయినపల్లి వినోద్‌కుమార్ డిమాండ్‌చేశారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీలకు చెందిన పలువురు నాయకులు సోమవారం వినోద్‌కుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా, కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్‌లకు రాష్ట్రంలో 8మంది చొప్పున ఎంపీలు ఉన్నారని, వీరంతా ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహూల్‌గాంధీని కలిసి బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని చేసి, 9వ షెడ్యూల్లో పొందుపర్చేలా ఒత్తిడి తేవాలని డిమాండ్‌చేశారు.
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు ; ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
హైదరాబాద్, జూలై28 (నమస్తే తెలంగాణ): బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. మంత్రివర్గ సమావేశంతోనే ఈ విషయం స్పష్టమైందని సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసం అలవికాని హామీలిచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు తప్పించుకునేందుకు దారులు వెతుకుతున్నదని దుయ్యబట్టారు. బీసీలకు 42శాతం కోటాపై చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.