హైదారాబాద్: పాకిస్థాన్‌పై హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఒక విఫల దేశమని, అది భారత్‌ను ఎన్నడూ శాంతంగా ఉండనీయదని విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్థాన్‌పై పటిష్ఠ చర్యలు చేపట్టాలన్నారు. పాకిస్థాన్ దేశాన్ని గ్రే లిస్టులో చేర్చేలా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్సు (ఎఫ్టీఏఎఫ్) చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్ లాంటి పొరుగు దేశాలతో పాక్‌కు స్నేహపూర్వక సంబంధాలు లేవని అన్నారు. పాకిస్థాన్ విమానాలు, నౌకలపై నిషేధం విధించి మోదీ ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు.