CM Revanth Reddy | రామచంద్రాపురం, జూన్ 2: తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ను సీఎం ఇష్ట్టమున్నట్టు తిట్ట డం తనతోపాటు ఉద్యమకారులందరికీ బాధేస్తున్నదని, అందుకే అలాంటి వ్యక్తితో సన్మా నం చేయించుకోవడం ఇష్టం లేకే సన్మాన కా ర్యక్రమాన్ని బాయ్‌కాట్ చేశా’ అని బీహెచ్ఈఎల్ కార్మిక నేత, తెలంగాణ ఉద్యమకారుడు జీ ఎల్లయ్య స్పష్టం చేశారు.
హైదరాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో అవతరణ వేడుకల్లో జరిగే స న్మాన కార్యక్రమానికి తనను ఫోన్లో ఆహ్వానించారని, ఆనాడే తనకు ఇష్టంలేదని చెప్పినట్టు తేల్చిచెప్పారు. సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ జేఏసీ చైర్మన్‌గా తెలంగాణ ఉద్యమంలో కార్మికులందరినీ ఏకతాటిపైకి తెచ్చి పోరాటం చేశానని, అసెంబ్లీ ముట్టడిలో తన రెండు కాళ్లు విరిగాయని ఎల్లయ్య తెలిపారు. 1969 నుంచి ఉద్యమంలో పాల్గొన్నానని, మలిదశ పోరాటంలో కేసీఆర్ వెన్నంటి ఉన్నానని చె ప్పారు.
నాడు ఏ ఉద్యమంలో లేనోళ్లు, ఈ ప్రాంతం గురించి తెలియనోళ్లు ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుతున్నరని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అని అంటున్నారని, మరి తెచ్చిం ది మాత్రం బరాబర్ కేసీఆరేనని స్పష్టం చేశా రు. ఉద్యమ నేత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఏమాత్రం తెలంగాణకు మంచిది కాదని ఎల్లయ్య తన బాధను వ్యక్తంచేశారు.