అయిజ, ఫిబ్రవరి 27: జోగుళాంబ గ ద్వాల జిల్లా అయిజ మండలం రాజాపురం గ్రామంలో నీటి ఎద్దడి నివారణకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి సమస్యల్లేకుండా చూస్తామని మిషన్ భగీరథ ఎస్ఈ జగన్మోహన్రావు తెలిపారు. మంగళవారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘చెంతనే తుంగభద్ర.. తీరని దాహం’ శీర్షికన కథనం ప్రచురితం కావడంతో అధికారుల్లో కదలిక వచ్చింది.
ఈఈ భీమేశ్వర్రావు, డీఈలు నా గరాజు, వెంకట్రాంనాయక్, ఏఈలు జాకీర్‌హుస్సేన్, రమేశ్‌తో కలిసి ఎస్ఈ జగన్మోహన్రావు గ్రామంలో పర్యటించారు. నీటి ఎద్దడిపై ఆరా తీశారు. మిషన్ భగీరథ నీటి సరఫరాలో రాజాపురం గ్రామం చివరన ఉన్నదని, పైప్‌లైన్‌లో నీటి లభ్యత తగ్గుతుండటంతో ట్యాంక్‌లు నిండలేదని, ఫలితంగా నీటి ఎద్దడి ఏర్పడిందని గ్రామస్థులు అధికారులకు వివరించారు.
గ్రామంలో ఎన్ని బోర్లు వేసినా ఫలితం లేకపోవడంతో 20 రోజులుగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్టు పంచాయతీ కార్యదర్శి లోకేశ్, స్థానికులు తెలిపారు. ప్రస్తుతం ట్యాంకర్‌తోపాటు పులికల్, బైనపల్లి, కొత్తపల్లిలోని 4ట్యాంకర్ల తో నీటిని సరఫరా చేస్తున్నామని చెప్పారు. గ్రామంలో శిథిలమైన బోర్లు, పురాతన బావి ని సందర్శించారు.
బోర్లఏర్పాటుకు అనువైన ప్రభుత్వ భూములను పరిశీలించారు. ప్ర త్యామ్నాయ మార్గాల ద్వారా మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తామని ఎస్ఈ తెలిపారు. బోరు బావులు తవ్వి నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నీటి ఎద్దడి సమస్యపై కథనం ప్రచురించిన ‘నమస్తే తెలంగాణ’కు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.