Viral Video | యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ పీఏసీఎస్ సహకార సంఘం బ్యాంకులో ఉద్యోగుల నిర్వాకం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అర్ధరాత్రి సమయంలో ప్రైవేటు వ్యాపారులు, దళారులతో కలిసి బ్యాంకు సిబ్బంది పార్టీ చేసుకున్నారు బ్యాంక్ చైర్మన్ చాంబర్లోనే కూర్చొని మద్యం తాగారు.
బ్యాంకులోనే ప్రైవేటు వ్యాపారులతో కలిసి సిబ్బంది మందు తాగడానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్మీడియాలో వైరల్గా మారింది. దీంతో బ్యాంకు ఉద్యోగుల తీరుపై స్థానికులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళారుల నుంచి లంచం తీసుకుని అర్ధరాత్రి వేళలో లోన్లు మంజూరు చేస్తున్నారని.. సదరు బ్యాంకు ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
PACS సహకార సంఘం బ్యాంకులో మద్యం తాగుతూ పట్టుబడ్డ ఉద్యోగులు
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు PACS బ్యాంకులో, అర్ధరాత్రి చైర్మన్ ఛాంబర్లో ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు, దళారులతో కలిసి మద్యం సేవించిన ఉద్యోగులు
బ్యాంకు ఉద్యోగులు దళారుల వద్ద లంచం తీసుకుని అర్ధరాత్రి లోన్లు మంజూరు… pic.twitter.com/jUwOfJTaXr
— Telugu Scribe (@TeluguScribe) April 1, 2026