భద్రాచలం, మే 2 : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజర్ గ్రామానికి చెందిన మోతీకుమార్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తూ శనివారం సముద్ర మట్టానికి 5,364 మీటర్ల ఎత్తులో ఉన్న బేస్ క్యాంప్ వరకు వెళ్లాడు. ఈ క్రమంలో బేస్ క్యాంపు నుంచి.
వీడియో సందేశం విడుదల చేశాడు. గతంలో మోతీకుమార్.. మౌంట్ కిలిమంజారో పర్వతం 5,895 మీటర్లు, మౌంట్ ఎలబ్రస్ పర్వతం 5,642 మీటర్లు అధిరోహించారు. ప్రస్తుతానికి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు అతడు దాతల సహకారం కోరుతున్నాడు.