గజ్వేల్, జూన్ 17: కుటుంబ కలహాలు ఇద్దరు చిన్నారుల ప్రాణాల మీదకొచ్చింది. అభం శుభం తెలియని కూతుళ్లను తల్లి సంపులోకి దింపి హ త్యకు యత్నించింది. ఈ చిన్నారులు దవాఖానలో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామలో సోమవారం చోటుచేసుకున్న ది. స్థానికుల వివరాల ప్రకారం.. జాలిగామకు చెందిన చాకలి మానస-రాజు దంపతులకు నాలుగేండ్ల క్రితం వివాహమైంది. వీరికి అనన్య (3), సహస్ర (11 నెలలు) సంతానం. కుటుంబ కలహాలతో తల్లి ఇద్దరు కూతుళ్లకు చు న్నికట్టి సంపులో ముంచుతూ పైకి లేపడంతో అపస్మారకస్థితిలోకి చేరుకోగానే పైకి తీసింది. అనంతరం ఆమె ఉరేసుకొని ఆత్మహత్యకు యత్నించి విఫలమైంది. గమనించిన స్థానికులు 108 వాహనంలో ముగ్గురిని గజ్వేల్‌కు ద వాఖానకు తరలించారు. ఇద్దరు చిన్నారులు అపస్మారకస్థితిలో వెళ్లారు. వీరిని హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలించారు. కాగా వీరి పరిస్థితి విషమంగా ఉన్నది. తల్లి మానస గజ్వేల్ దవాఖానలో చికిత్స పొందుతుండగా ఆమెకు ఎలాంటి ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు.