హైదరాబాద్ : ఆ తల్లికి ఏ కష్టమొచ్చిందో తెలియదు కానీ నవ మాసాలు కనిపెంచిన బిడ్డలను తనే కడతేర్చింది. ఈ విషాదకర సంఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధి రాజీవ్ నగర్లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..జ్యోతి(31) అనే మహిళ బంజారాహిల్స్‌లోని ఓ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నది. ఆమె భర్త విజయ్ సెంట్రింగ్ కాంట్రాక్టర్ పని చేస్తున్నాడు. ఏం జరిగిందో తెలియదు కానీ, జ్యోతి తన ఇద్దరు పిల్లలు అర్జున్(4),ఆదిత్య (2)లకు విషమిచ్చి తాను ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.