యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార యూనియన్ లిమిటెడ్(మదర్ డెయిరీ) హస్తగతమైంది. ఖాళీగా ఉన్న ఆరు డైరెక్టర్ స్థానాల కోసం శుక్రవారం రంగారెడ్డి జిల్లాలోని హయత్‌నగర్ ఎస్వీ కన్వెన్షన్‌లో ఓటిం గ్ జరిగింది. రంగారెడ్డి జిల్లాలో రెండు, యా దాద్రిలో నాలుగు స్థానాలు ఖాళీగా ఉండ గా.. మొత్తంగా 297 మంది ఓటర్లు ఉన్నా రు. యాదాద్రిలోని నాలుగు సీట్లకు కాంగ్రె స్, బీఆర్ఎస్ నుంచి అభ్యర్థులు బరిలో నిలిచారు. ముందుగానే కాంగ్రెస్ పార్టీ క్యాంప్ రాజకీయాలు, తాయిలాలకు తెరదీసింది. ఒక్కో ఓటరుకు రూ.30 వేల వరకు పంపిణీ చేసింది. అయినప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్థులు హోరాహోరి పోటీనిచ్చారు. కాగా శనివారం మదర్ డెయిరీలో చైర్మన్ ఎన్నిక జరుగనున్నది. చైర్మన్‌గా ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలానికి చెందిన గుడిపాటి మధుసూదన్‌రెడ్డిని ఎన్నుకోనున్నట్టు తెలిసింది.
స్కూల్ గ్రాంట్ విడుదల
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): సర్కారు స్కూళ్ల రోజువారీ నిర్వహణ ఖర్చుల కోసం పాఠశాల విద్యాశాఖ నిధులు మంజూరుచేసింది. 50శాతం స్కూల్, స్పోర్ట్స్ గ్రాంట్‌ను విడుదల చేసింది. రాష్ట్రంలోని 21,342 స్కూళ్లకు 50శాతం కాంపొజిట్ స్కూల్ గ్రాంట్ రూ. 48 కోట్లు, స్పోర్ట్స్ గ్రాంట్ రూ.12కోట్లు విడుదల చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి ఉత్తర్వులిచ్చారు. నాలుగు మాసాలుగా స్కూల్, స్పోర్ట్స్ గ్రాంట్ నిధులు మంజూరు విడుదల చేయకపోవడంతో ఇటీవలే నమస్తే తెలంగాణ లో ‘చాక్‌పీసులు, డస్టర్లు కొనేందుకు డబ్బులేవి’ అన్న శీర్షికతో కథనం ప్రచురితమైంది. జూలైలోనే 50శాతం గ్రాంట్‌ను మంజూరుచేసిన విషయాన్ని ప్రస్తావించింది. దీంతో స్పందించిన విద్యాశాఖ తాజాగా స్కూల్, స్పోర్ట్స్ గ్రాంట్ నిధులను మంజూరుచేసింది.