పటాన్చెరు, సెప్టెంబర్ 1 : భర్త తాగుడుతో విసుగుచెందిన ఆ ఇల్లాలు.. తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నది. ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొన్నది. ఈ ఘటన ఆదివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారంలో చోటుచేసుకున్నది. సదాశివపేట మండలం ఆత్మకూర్‌కు చెందిన ఆంజనేయులు (35) ఇస్నాపూర్‌లో బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నా డు. అతడికి భార్య సువర్ణ (28), జస్వంత్ (5), చిన్మయి (3), చిత్ర (3) పిల్లలు ఉన్నారు. చిన్మయి, చిత్ర కవల పిల్లలు. ఆంజనేయు లు మద్యానికి బానిసయ్యాడు. మద్యం తాగొద్దని భార్య చాలా సార్లు వారించడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి.
కొంతకాలంగా ఆంజనేయులు ఆరోగ్యం దెబ్బతిన్నది. కు టుంబ కలహాలు పెరిగాయి. మెకానిక్ పని కూడా సరిగ్గా చేయడం లేదు. ఆంజనేయులు ను రిహాబిలిటేషన్ సెంటర్లో చేర్చారు. ఆర్థిక ఇబ్బందులు తీవ్రం కావడంతో విసుగుచెందిన సువర్ణ ముగ్గురు పిల్లలకు ఆదివారం మధ్యాహ్నం విషం ఇచ్చి చంపేసింది. పిల్లలు చనిపోయారని నిర్ధ్దారించుకున్నాక.. తానూ గదిలోకి వెళ్లి ఫ్యానుకు ఉరేసుకున్నది. ఇరుగు పొరుగువారు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తలుపులు పగులకొట్టి గది లోపలికి వెళ్లి చూసేసరికి తల్లి, ముగ్గురు పిల్లలు విగతజీవులుగా ఉన్నారు. పటాన్చెరు డీఎస్పీ ర వీందర్‌రెడ్డి, సీఐ ప్రవీణ్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు దవాఖానకు తరలించారు.