చెన్నారావుపేట, మార్చి 7: గుండెపోటు వచ్చి తల్లీకొడుకు మృతిచెందిన ఘటన మంగళవారం వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని పాపయ్యపేట గ్రామంలో చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నెబోయిన స్వామి(45) అనారోగ్యం కారణంగా దవాఖానాలో చికిత్స పొందుతున్నాడు. కొడుకు అనారోగ్యంతో బాధపడుతున్నాడని మనోవేదనకు గురైన తల్లి రాధమ్మ(58) సోమవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందింది. దవాఖానాలో చికిత్స పొందుతున్న కుమారుడు.. తల్లి మరణ వార్త విని
మంగళవారం గుండెపోటు వచ్చి మృతి చెందాడు. గంటల వ్యవధిలో తల్లీకొడుకు మృతిచెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.