ఐసీసీ అండర్-19 వన్డే ప్రపంచకప్‌లో యువ భారత జట్టు.. నేడు ఇంగ్లండ్‌తో జరుగబోయే ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది. ఇరుజట్లూ టోర్నీలో అపజయమన్నదే లేకుండా ఫైనల్ చేరి టైటిల్ పోరుకు సిద్ధమయ్యాయి. ఈ టోర్నీలో భారత్ ఇప్పటికే 5 టైటిల్స్ గెలిచి ఆరో కప్పుపై కన్నేసింది.
ఇంగ్లండ్‌కు మాత్రం 1998 తర్వాత మళ్లీ ట్రోఫీ దక్కలేదు. ఈసారి ఎలాగైనా 28 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాలని ఆ జట్టు బరిలోకి దిగుతున్నది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభమయ్యే మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో వీక్షించొచ్చు.