జగిత్యాల: జిల్లాలోని మెట్పల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని రామలచ్చక్కపెట్ శివార్లలోని వరద కాలువలో దూకి తల్లీ కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మనగర్ గ్రామానికి చెందిన వనజ (28), శాన్వి (6) తల్లి కూతుళ్లు. కుటుంబ కలహాల నేపథ్యంలో వారిద్దరు శనివారం ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం వారిద్దరి మృతదేహాలను స్థానికులు వరద కాలువలో గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.