Mothe | మోర్తాడ్, ఏప్రిల్ 14: తెలంగాణ మలిదశ పోరుకు ఆ పల్లె అండగా నిలిచింది. ఊరంతా నాటి ఉద్యమ సారథి కేసీఆర్ వెంట నడిచింది. తెలంగాణ సాధనకు ఒంటరిగా బయల్దేరిన కేసీఆర్‌కు మొట్టమొదట మద్దతు ప్రకటించింది.. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని మోతె (Mothe) గ్రామం. బీఆర్ఎస్ వెంటే నడుస్తామని, స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలిపించుకుంటామని తీర్మానించడం ఉద్యమానికి నాడు మరింత బలాన్నిచ్చింది. మోతెతో ఎంతో అనుబంధం పెంచుకున్న ఉద్యమ సారథి ఆ పల్లెను అలాగే వదిలేయలేదు. పదేండ్ల పాలనలో వేముల ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆ పల్లెను అభివృద్ధి బాట పట్టించారు.
సమైక్యాంధ్రలో కష్టాలు..స్వరాష్ట్రంలో అభివృద్ధి పరుగులు..
సమైక్యాంధ్రలో మోతె గ్రామస్తులు ఎన్నో కష్టాలు స్వరాష్ట్రం వచ్చాక అవన్నీ తొలగిపోయాయి. ‘తలాపున పారుతుంది గోదారి.. మాచేను చెలక ఎడారి’ అనే దుస్థితి నుంచి రెండు కాలాలు పంటలు పండించుకునే స్థాయికి మోతె చేరుకుంది. ఈ గ్రామానికి ఒకవైపు కప్పలవాగు, మరోవైపు పెద్దవాగు ఉంటాయి. కానీ తాగు, సాగునీటికి దశాబ్దాలుగా గోసపడ్డారు. ఈ విషయాన్ని గుర్తించిన కేసీఆర్ రాష్ట్రం ఏర్పడిన వెంటనే మోతె గ్రామస్తులకు చెందిన మూడు వేల ఎకరాలకు వంద శాతం సబ్సిడీతో డ్రిప్ సౌకర్యం కల్పించారు. కేసీఆర్ సహకారంతో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి గ్రామాన్ని అభివృద్ధి బాట పట్టించారు. రూ.12 కోట్లతో కప్పలవాగుపై రెండు చెక్‌డ్యాంలు, రూ.16 కోట్లతో పెద్దవాగుపై రెండు చెక్‌డ్యాంలు నిర్మించారు. గ్రామంలోని పెద్దచెరువుకు రూ.4కోట్లతో మాటుకాలువ నిర్మాణ పనులు చేయించారు. దీంతో ఒకప్పుడు సాగునీరు లేక ఇబ్బంది పడిన రైతులకు రెండు పంటలు పండించుకునే అవకాశం లభించింది. మరోవైపు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. రూ.1.05కోట్లతో జీపీ భవనం, రూ.2.50 కోట్లతో పీహెచ్సీ నిర్మాణం, రూ.2 కోట్లతో సీసీరోడ్లు, రూ.కోటి వ్యయంతో బైపాస్‌రోడ్డు, రూ.12కోట్లతో కప్పలవాగుపై వంతెన, మోతె -వేల్పూర్ నడుమ వాగుపై రూ.15 కోట్లతో హైలెవెల్ బ్రిడ్జి నిర్మించారు. ఇటీవల రూ.50లక్షలతో పీహెచ్‌సీకి ప్రహారీ నిర్మాణం పనులు జరిగాయి. ఉద్యమానికి మద్దతుగా నిలిచి మిగతా గ్రామాలకు దిక్సూచిలా నిలిచిన మోతె గ్రామం అభివృద్ధిలోనూ ఆదర్శంగా నిలిచింది.
ఉద్యమ స్ఫూర్తిని చాటిన మోతె తెలంగాణ ఉద్యమంలో అండగా నిలిచిన మోతెకు మే 5, 2001న ఉద్యమనేత కేసీఆర్ వచ్చారు. ఉద్యమానికి అండగా నిలిచిన గ్రామస్తులను అభినందించారు. అదే రోజు మోతె మట్టిని ముడుపుకట్టి తన వెంట తీసుకెళ్లారు. రాష్ర్టాన్ని సాధించుకున్నాకే మోతెకు వచ్చి ముడుపు విప్పుతానని ప్రకటించారు. ఇది తెలంగాణలోని అన్ని గ్రామాల్లో స్ఫూర్తిని నింపింది. రాష్ర్టాన్ని సాధించుకున్నాక 2014 మార్చి 28న మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, దివంగత నేత వేముల సురేందర్‌రెడ్డి, ఇతర నేతలతో కలిసి కేసీఆర్ మోతెకు వచ్చారు. ముడుపు విప్పి ఆ గ్రామ మట్టిలో కలిపారు.
కార్యకర్తలను ఇబ్బంది పెడితే వదిలిపెట్టం: చల్లా
బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను ఇబ్బందిపెట్టే అధికారుల పేర్లు డైరీలో రాసుకోవాలని, రెండేండ్ల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అప్పుడు వాళ్ల సంగతి చూసుకుంటామని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హెచ్చరించారు. సోమవారం వరంగల్ జిల్లా సంగెం, గీసుగొండ మండలాలతో పాటు గ్రేటర్ వరంగల్ 15,16,17వ డివిజన్ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలతో బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ టెక్స్టైల్ పార్కులో కొందరు గంజాయి మత్తు లో చిన్నారులపై లైంగిక దాడులు చే స్తున్నారని ఆరోపించారు.