CM KCR | హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): మన జీవితాలను మార్చే శక్తి ఓటుకు ఉన్నదని, దానిని ఆలోచించి వేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కోరారు. అప్పుడే సమాజంలో మార్పు సాధ్యమని అన్నారు. రై తుల జీవితాలు బాగుపర్చేందుకు ప్రతి ఒక్క రూ ఒక కేసీఆర్ కావాలని పిలుపునిచ్చారు. జడ్పీ ఎన్నికలతో మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్ర భంజనం మొదలవుతుందని అన్నారు. వనరుల పరంగా సుసంపన్నమైన మనదేశంలో ఇప్పటికీ తాగు, సాగునీటికి, కరెంటు కోసం ఎందుకు ఇబ్బంది పడాల్సి వస్తున్నదో ఆలోచించాలని సూచించారు. ప్రభుత్వ విధానాలు మా రితేనే ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందని, అలాంటి గుణాత్మక మార్పు కోసమే బీఆర్ఎస్ ఆవిర్భవించిందని చెప్పారు. మహారాష్ట్రకు చెం దిన పలువురు నేతలు బుధవారం తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కేసీఆర్ వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. అనంతరం వారిని ఉద్దేశించి చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే..
గుణాత్మక మార్పుతోనే జీవితాల్లో మార్పు
దేశంలో అనేక జాతీయ, ప్రాంతీయ పార్టీలున్నాయి. అనేక ప్రభుత్వాలు పాలించాయి. నేతలు అనేక హామీలు ఇచ్చారు, మాటలు చెప్పారు. కానీ, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏండ్ల తర్వాత కూడా మన జీవితాలు ఇంకా ఇలాగే ఎందుకున్నాయి? కరెంటు, నీళ్ల కోసం ఎందుకు కష్టపడాల్సి వస్తున్నది? వనరుల పరంగా మన దేశం సుసంపన్నమైనది. శ్ర మించే మానవ వనరులున్నాయి. అయినా ఎం దుకు ఇలా ఉన్నాం? అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అందుకే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది. ఒక నేత కోసమో, అధికారం కోసమో ఈ పార్టీ రాలేదు. ఇది ఏ ఒక్క రాష్ర్టానికో పరిమితమైన పార్టీ కాదు. దేశంలో గుణాత్మక మా ర్పు కోసం వచ్చింది. ఆ మార్పు వచ్చే వరకు మన జీవితాలు మారవు. మాటలు వింటూనే ఉంటాం.. హామీలను నమ్ముతూనే ఉంటాం. మోసపోతూనే ఉంటాం. ప్రభుత్వ విధానాలు మారినప్పుడే మార్పు సాధ్యమవుతుంది.
జొన్నరొట్టె ముందు పిజ్జా పనికొస్తదా?
మనదేశంలో మన కండ్లముందే అన్ని రకాల వనరులు ఉన్నాయి. సుసంపన్నమైన దేశం మనది. మన జీవితం సాఫీగా సాగాలంటే ముఖ్యంగా నీరు, కరెంటు కావాలి. కానీ.. తెలంగాణ మినహాయిస్తే దేశమంతటా కరెంటు సమస్య, తాగు, సాగునీటి సమస్యలు ఉన్నాయి. నీళ్లను మనం ఫ్యాక్టరీల్లో తయారు చేయలేం. అవి భగవంతుడు, ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం. అమూల్యమైన వనరు. వ్యవసాయానికి, తాగునీటికి, పరిశ్రమలకు, ఇతర అవసరాలకు.. ఇలా దేశానికి కావాల్సిన నీళ్లకన్నా రెట్టింపు పరిమాణంలో నీరు మనకు అందుబాటులో ఉన్నది. అయినా మనం ఇప్పటికీ నీటికోసం అల్లాడుతున్నాం. కారణం ఏమిటి? నీళ్ల కోసం రష్యానో, అమెరికానో అడగాల్సిన అవసరం లేదు. మనకు నీళ్లున్నాయి, మనకు అధికారం ఉన్నది. అయినా ఎందుకు తాగు, సాగునీరు అందడం లేదు? ఇక్కడికి వచ్చినవాళ్లలో గడ్చిరోలి వాళ్లు కూడా ఉన్నారు. అక్కడ మహానది, గోదావరి ప్రవహిస్తున్నా.. తాగునీటికి ఎందుకు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది? ఆ రాష్ట్రంలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఇలా ప్రజాప్రతినిధులందరూ ఉన్నా ఎందుకు నీళ్లు రావడం లేదు? నేతల ఆలోచనా విధానం, విధానపరమైన లోపాలే ఇందుకు కారణం. దేశంలో ఏటా 1.40 లక్షల టీఎంసీల నీళ్లు వర్షం రూపంలో కురుస్తాయి.
ఇందులో 70 వేల టీఎంసీలు ఆవిరి అవుతాయి. మిగతా 70 వేల టీఎంసీల శుద్ధ జలం నదుల్లో పారుతున్నది. మనదేశ విస్తీర్ణం 83 కోట్ల ఎకరాలు. ఇందులో 41 కోట్ల ఎకరాల భూమి వ్యవయసాయానికి అనుకూలం. ప్రతి ఎకరాకు సరిపడా ఇచ్చేంత నీళ్లున్నాయి. ఇంతకన్నా ఏం కావాలి? ఇన్ని వనరులున్న భారతదేశం ఈ ప్రపంచాన్ని ఏలాలి. మన ఉత్పత్తులు ప్రపంచం నలుమూలలకు విస్తరించాలి. మన రైతులు ధనికులుగా మారాలి. కానీ ఏం జరుగుతున్నది? మన పిల్లలు పిజ్జాలు, బర్గర్లు తింటున్నారు. మన జొన్న రొట్టెతో పోల్చితే పిజ్జాలు ఏపాటి? ప్రపంచంలో అనేక రకాల ఆహార పదార్థాలు తినే మనుషులున్నారు. అవన్నీ మన దగ్గర పండించాలి. పొలాలకు దగ్గర్లోనే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు స్థాపించాలి. వాటిల్లో తయారయ్యే ఉత్పత్తులు ప్రపంచం మొత్తం ఎగుమతి చేయాలి. కేంద్రానికి దమ్ముం టే దేశంలో ప్రతి ఎకరాకు నీళ్లిచ్చి దీనిని సు సాధ్యం చేయొచ్చు’ అని కేసీఆర్ చెప్పారు.
ఎన్నికలు రాగానే మనకు రోగం వస్తది
ఇక్కడ నేను మాట్లాడుతుంటే.. పక్కనే ఉన్న మహారాష్ట్ర వాసి ‘మాల్వి’ నాదిక్కు చూస్తూ ‘మహారాష్ట్రలో కిచిడీ సర్కార్ నుంచి మమ్మల్ని విముక్తి చేయండి’ అని అడుగుతున్నరు. రాజకీయాలు, విధానా లు, చట్టాలు, సభలు.. ఇవన్నీ ఆకాశంలో ఏమీలేవు. ఈ భూమి మీదే ఉన్నాయి. అందుకే నేను ఈ భూమి గురించే మాట్లాడుతున్నాను. నేతలకు ఎన్నికల సమయంలో ఓట్లు పడితే చాలు.. వాళ్ల దుకా ణం నడిస్తే చాలు. ప్రతిసారి ఓట్లు పడుతున్నాయి కాబట్టి ఎంతమంది రైతులు మరణించినా, ప్రజలకు ఎంత నష్టం కలిగినా రాజకీయ నాయకులకు ఎలాంటి బాధ ఉండదు. తప్పంతా ప్రజలదే. ఎలక్షన్లు వస్తే చాలు మనకు రోగం వస్తది. జాతీయవాదం అని, కులతత్వం అని.. ఇలాంటి రోగాలు అంటుకుంటాయి. మ నదోస్తు అని, మన సుట్టపోడని, ఫోన్ చేసి చెప్పాడని, తీయ్యగా మాట్లాడిండని ఎవరికిపడితే వారికి ఓటు వేస్తాం. వాస్తవానికి ఓటు మన జీవితాలను మార్చే ఆయు ధం. కానీ మన దేశంలో సక్రమంగా వాడుకోవడం లేదు. ఎవరికి ఓటేస్తున్నాం ? ఎందుకు వేస్తున్నాం? వాళ్లకు వేయడం వల్ల ఏం లాభం? అని ఆలోచించినప్పుడే మార్పు సాధ్యం.