యాదగిరిగుట్ట, జూలై 27: సకాలం లో కేసుల పరిష్కారంతోపాటు అట్టడుగు వర్గాలకు సత్వర న్యాయం అందేలా మరిన్ని కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్టు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీ వేణుగోపాల్ అన్నారు. శనివారం యాదగిరిగుట్ట పట్టణంలోని తులసీ కాటేజీ ప్రాంతంలో ఏర్పాటుచేసిన జూనియర్ సివిల్ జడ్జి, మొదటి శ్రేణి జుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టును శనివారం ప్రారంభించారు. ఈ సం దర్భంగా జస్టిస్ వేణుగోపాల్ మాట్లాడు తూ.. విద్య ద్వారానే సమాజంలో మా ర్పు వస్తుందని, వేగంగా మారుతున్న కాలంలో సోదరభావంతో మెలగడం ముఖ్యమని పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట, రాజాపేట మండలాలకు సంబంధించిన కేసుల పరిష్కారానికి యాదగిరిగుట్టలో కోర్టును ప్రారంభించినట్టు తెలిపారు. కేసుల పరిష్కారానికి త్వరలో శాశ్వత న్యాయమూర్తిని నియమించనున్నట్టు పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజన , జి ల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ జయరాజు, కలెక్టర్ హనుమంత్ కే జండగే, జడ్జీలు వీ మాధవీలత, డీ నాగేశ్వర్రావు, జీ కవిత, ప్రదీప్, ఎస్ చందన, ఎస్ సుమలత, మహతి, డీసీపీ రాజేశ్ చంద్ర, తదితరులు పాల్గొన్నారు.