KTR | రాష్ట్రం కరువులో ఉంటది.. కానీ సుందరీకరణ మాత్రం ఆగదు : కేటీఆర్
KTR | ఏదడిగినా ఒక్కటే జవాబు.. అప్పులపాలైపోయింది రాష్ట్రం ఖజానాలో పైసల్లేవ్.. మరి నేనడుగుతున్న దేనికి పైసల్లేవు.. మూసీ సుందరీకరణకు పైసలు ఎక్కడి నుంచి వస్తున్నయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.
KTR | ఆదిలాబాద్‌లో ఈ మధ్యకాలంలోనే గత వారం రోజుల్లో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.. ప్రజల కష్టాలు చూడకుండా.. రైతుల కన్నీళ్లు తుడవకుండా.. వాటి గురించి ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి సోయి లేదు.. పట్టింపు లేదని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. .. ఇవాళ 100 శాతం ఎస్టీపీల నిర్మాణం పూర్తయిపోయింది.. మా ప్రభుత్వంలోనే మేమే రూ.4 వేల కోట్లతో కట్టాం. మొత్తం ప్రాజెక్టు కూడా రూ.16 వేల కోట్లల్లో పూర్తి చేయొచ్చు. డీపీఆర్ బయటపెట్టండి అని మేం అసెంబ్లీలో అడిగితే ఈ రోజు వరకు సమాధానం లేదు.. ఏసియన్ డెవలప్ మెంట్ బ్యాంకు అప్పు తీసుకున్నమంటరు.. మరి వాళ్లకైనా డీపీఆర్ ఇచ్చారా చూపించమంటే అది కూడా దిక్కు లేదు.. అంటే డీపీఆర్ లేదు.. పబ్లిక్ హియరింగ్ జరుగదు.. రాష్ట్రం కరువులో ఉంటది.. కానీ సుందరీకరణ మాత్రం ఆగదన్నారు.
హైదరాబాద్‌లో తాగునీరు లేదు.. హైదరాబాద్‌లో రోజులకు 7 వేల ట్యాంకర్ల నీళ్లు బుక్ అవుతున్నయి.. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన 10 టీఎంసీల మల్లన్నసాగర్ నీళ్లు తీసుకొని మాత్రం మూసీలో తీసుకొచ్చి పోస్తా.. ఇది ముఖ్యమంత్రి విధానం. మీకసలు మానవత్వం ఉందా..? అని ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. కనీస మాత్రం సంస్కారం ఉందా..? ప్రజల పట్ల పట్టింపు ఉందా..? లేదా ఎంతసేపు మీకు ఢిల్లీకి వెళ్లి ఈఎంఐలు కట్టడానికే సరిపోతుందా..? ఈఎంఐ ముఖ్యమంత్రి అని అడుగుతున్నా..? ఇదే పట్టింపు.. సుందరీకరణ మీదున్న శ్రద్ద, ఆసక్తి,, మూసీ మీదున్న తాపత్రయం ఇవాళ వేరే విషయాల్లో ఎందుకు లేదని కేటీఆర్ ప్రశ్నించారు..
మీ కాంగ్రెసోళ్లు మేడిగడ్డ పిల్లర్లు పేల్చేసి మూడేళ్లవుతుంది.. అక్కడ బ్లాస్టింగ్ శబ్ధం వినబడిందని ఆ రోజుల్లోనే.. అప్పుడున్న ప్రభుత్వంలోనే ఇంజినీర్లు పోయి పోలీస్ కంప్లెయింట్ కూడా ఇచ్చారు. అక్టోబర్ 21 2023.. మూడేళ్లవుతుంది. దానిపై ఎంక్వైరీ కాదు.. ఆ పర్రె పడ్డ పిల్లర్ రిపేరు కాదు.. మేడిగడ్డ బ్యారేజీని మళ్లీ నీళ్లెత్తుకునేందుకు వినియోగించుకునే ఆలోచన లేదు.. అక్కడ నీళ్లు నిల్వ చేసే ఆలోచన లేదున్నారు. పోయి కృష్ణా, గోదావరి నదుల్లో మన వాట తేల్చాలన్న విషయంలో ఆసక్తి లేదు.. ఏదడిగినా ఒక్కటే జవాబు.. అప్పులపాలైపోయింది రాష్ట్రం ఖజానాలో పైసల్లేవ్.. మరి నేనడుగుతున్న దేనికి పైసల్లేవు.. మూసీ సుందరీకరణకు పైసలు ఎక్కడి నుంచి వస్తున్నయని కేటీఆర్ ప్రశ్నించారు.
LIVE : KTR Press Meet at Telangana Bhavan https://t.co/jF4NdnVBXn
— Telugu Scribe (@TeluguScribe) October 29, 2026
Read Also :
Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. పది మంది మృతి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రాష్ట్రం కరువులో ఉంటది.. కానీ సుందరీకరణ మాత్రం ఆగదు : కేటీఆర్
Spain Train Crash: డ్రైవర్లు, కంట్రోల్ సెంటర్ మధ్య సంభాషణ.. ఆడియో రిలీజ్ చేసిన స్పానిష్ మీడియా
Anirudh – Kaviya | అనిరుధ్ – కావ్య మారన్ రిసెప్షన్.. ప్రధాని, సీఎం విజయ్ సహా ప్రముఖులకు ఆహ్వానం!
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. పది మంది మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

