తాండూర్, అక్టోబర్ 16 : మండలంలోని సింగరేణి ప్రాంతమైన మాదారం టౌన్ షిప్లో కోతుల బెడద నియంత్రణ కోసం కొండెంగల ఫోటోల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మాజీ ఎంపీటీసీ సూరం రవీందర్ రెడ్డి చిన్న ఆలోచనలతో కొండెంగెల ఫోటోలతో ఫ్లెక్సీలను తయారు చేయించి కోతుల బెడద తగ్గించడం కోసం ఈ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. గ్రామం మొత్తం ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలను అంటించడం జరిగింది. ఒకవేళ ఫ్లెక్సీలను చూసి కోతుల బెడద తగ్గితే త్వరలోనే కార్మిక కాలనీలో ప్రతి ఇంటికి ఈ కొండెంగెల ఫోటోల ఫ్లెక్సీలను అంటించడం జరుగుతుందని ఆయన తెలిపారు.