Suryapet | సూర్యాపేట, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : ‘బాబోయ్ వానరాలు’ అంటూ సూర్యాపేట జిల్లా బెంబేలెత్తిపోతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. వేల సంఖ్యలో గుంపులుగా తిరుగుతూ గ్రామాల్లో దండయాత్ర చేస్తున్నాయి. వాటంతట అవే పరస్పరం దాడులు చేసుకుంటూ.. ప్రజలపైనా తిరగబడి తీవ్రంగా గాయపరుస్తున్నాయి.
పంటలను నాశనం చేస్తూ రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ఇటీవల నూతనకల్ మండల కేంద్రంలో కోతులు రెండు గ్రూపులు విడిపోయి కొట్లాడటం భయానకం సృష్టించింది. స్థానిక భగత్‌సింగ్‌నగర్‌లో సుమారు 2 వేల కోతులు బీభత్సం సృష్టించాయి. నాగారానికి చెందిన నూక నర్సమ్మ, జంగిడి నర్సయ్యపై కోతులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి ద వాఖాన పాలయ్యారు.
ఇలాంటి ఘటనలు నిత్యం ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. గ్రామాల్లో ఒంటరిగా తిరగాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ర హదారులపై వెళ్లే వాహనదారుల పరిస్థితి మరింత ఘోరం. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోతుల బెడద నుంచి తమను కాపాడాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.