మోహన్‌బాబుకు సుప్రీంలో ఊరటసినీ నటులు మంచు మోహన్‌బాబు, ఆయన కుమారుడు విష్ణుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2019లో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. తమ విద్యాసంస్థలోని విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని తిరుపతిలో ఆందోళన చేపట్టారు.
ఏపీలో అప్పటికే ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా, అప్పటి ఎన్నికల అధికారి హేమలతకు ఫిర్యాదు అందింది. దీంతో మోహన్‌బాబు, విష్ణుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని మోహన్‌బాబు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ధర్మాసనం వీరి అభ్యర్థనను సమర్థించింది.