హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మైనార్టీ కమిషన్ చైర్మన్‌గా నియమితులైన తారిఖ్ అన్సారీ, కమిషన్ సభ్యులుగా నియమితులైన మహ్మద్ అతార్ ఉల్లా, మహమ్మద్ తన్వీర్, జానీ దర్శన్ సింగ్ బాధ్యతలను స్వీకరించారు. ఖైరతాబాద్ జలమండలిలో శనివారం ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమానికి ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, హోంమంత్రి మహమూద్ అలీ, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, హజ్ కమిటీ చైర్మన్ మహ్మద్ సలీం ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. చైర్మన్, సభ్యులకు పుష్పగుచ్ఛాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, మైనార్టీ వెల్ఫేర్ ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, వక్ఫ్ బోర్డు, హజ్ కమిటీ, మైనార్టీ వెల్ఫేర్ అధికారులు పాల్గొన్నారు.