హజ్ కమిటీ చైర్మన్గా మహ్మద్ సలీం
తెలంగాణ హజ్ కమిటీ చైర్మన్గా మహ్మద్ సలీం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రభుత్వం ఇప్పటికే హజ్ కమిటీని 16 మంది సభ్యులతో పునరుద్ధరించింది
శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు మహమూద్ అలీ, తలసాని
ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు: హజ్ కమిటీ చైర్మన్
హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హజ్ కమిటీ చైర్మన్గా మహ్మద్ సలీం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రభుత్వం ఇప్పటికే హజ్ కమిటీని 16 మంది సభ్యులతో పునరుద్ధరించింది. మైనారిటీ సంక్షేమ శాఖ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం ఎన్నికల అధికారిగా వ్యవహరించగా హజ్ కమిటీ పాలకమండలి సభ్యులు సోమవారం సమావేశమై, వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మహ్మద్ సలీంను హజ్ కమిటీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు.
అనంతరం పాలక మండలి సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. హజ్ కమిటీ చైర్మన్, పాలకమండలి సభ్యులకు శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ.. అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో దేశంలో ఏ రాష్ట్రం కల్పించని విధంగా హజ్ యాత్రికులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో హజ్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మిరాజ్, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, ఖమ్మం కార్పొరేటర్ షేక్ మక్బుల్, నల్లగొండ కౌన్సిలర్ అసిమా సుల్తానా, కొండాపూర్ కార్పొరేటర్ షేక్ హమీద్, సయ్యద్ నిజాముద్దీన్, సయ్యద్ ఇర్ఫాన్ ఉల్హక్, నాదల్ అలీ రిజ్వీ, నవీద్ ఇక్బాల్, జాఫర్ఖాన్, సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్, వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ మసీఉల్లాఖాన్, హజ్ కమిటీ సీఈవో షఫియుల్లా, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ షేక్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

