(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో డిసెంబర్ 8, 9న నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానం అందించారు. 59వ సారి ఢిల్లీ వెళ్లిన రేవంత్‌రెడ్డి కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అశ్వినీవైష్ణవ్, మనోహర్‌లాల్ ఖట్టర్తోనూ భేటీ అయ్యారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని ప్రధాని మోదీతో భేటీలో కోరినట్టు సీఎం కార్యాలయం తెలిపింది.- హైదరాబాద్