హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తాం.. అగో వస్తున్నది, ఇగో వస్తున్నది అని కేంద్రం, బీజేపీ నేతలు గొప్పలు చెప్పేవారు! తీరా దాన్ని మహారాష్ట్రలోని లాతూర్కు లగెత్తించిండ్రు. పసుపు బోర్డు తెప్పిస్తా! రైతుల భవిష్యత్తు మార్చేస్తానన్న హామీకి అతీ లేదు, గతీ లేదు. హైదరాబాద్‌లో ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ అన్నరు.. కొబ్బరికాయ కొట్టి పనులు షురూ చేసుడే అన్నరు.. కండ్లు మూసి తెరిచేలోగా, గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు జంప్ చేయించిండ్రు. ఇప్పుడిక జనపనార బోర్డు వంతు వచ్చింది. దాన్నీ విలీనం చేసి కానరాకుండా చేసిండ్రు. మొత్తంగా తెలంగాణను వంచించిండ్రు. కండ్ల మంటతో కుట్రలు చేస్తున్నరు. ఒక్క తెలంగాణే కాదు.. దక్షిణాది రాష్ర్టాలపై కేంద్రంలోని బీజేపీ సర్కారు వివక్ష చూపుతున్నది. ఈ మేరకుజనపనార బోర్డు ప్రాంతీయ కార్యాలయం కొనసాగుతున్నది. రాష్ట్ర జ్యూట్ అవసరాలను, ఇక్కడి జనపనార ఉత్పత్తులు, పరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రాంతీయ కార్యాలయం ఎంతో దోహదం చేస్తున్నది.
రాష్ర్టావసరాల కోసం కేసీఆర్ ప్రోత్సాహం
తెలంగాణలో వరి ధాన్యం భారీగా దిగుబడి పెరిగిన నేపథ్యంలో ధాన్యం సంచులు పెద్ద ఎత్తున అవసరం అవుతున్నాయి. వీటన్నంటిని కొల్కతా నుంచి తెప్పించుకోవాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో జనపనార మిల్లులను తెలంగాణలో స్థాపించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశాలతో పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు ప్రత్యేక చొరవ చూపారు. ఐదు ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి మంత్రి కేటీఆర్ సమక్షంలో ప్రభుత్వం ఆయా సంస్థలతో ఒప్పందం కూడా చేసుకున్నది. వాటికి ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు, రాయితీలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏకంగా ప్రాంతీయ కార్యాలయాన్ని మూసివేసింది. ఇక్క డ పనిచేస్తున్న ఉద్యోగులు ఎక్కడో ఉన్న కోల్‌కతాలో పనిచేయాలని, ఇక్కడి ఆస్తులన్నంటినీ కొల్‌కతాకు తరలించాలని సూచించింది. దీనిపై బీజేపీ నేతలు ఏం సమాధానం చెపుతారని పలువురు తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు.