హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌రెడ్డి కలిసి కాళేశ్వరంపై కుట్రలు పన్నుతున్నారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి ఆరోపించారు. సంక్షేమ పథకాలు, నీటి పారుదల ప్రాజెక్టులతో తెలంగాణకు వన్నె తెచ్చిన కేసీఆర్‌ను బద్నాం చేసేందుకు యత్నిస్తున్నారని సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
హైదరాబాద్, సెప్టెంబర్1 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరిన సీఎం రేవంత్‌రెడ్డి సెల్ఫ్‌గోల్ వేసుకున్నారని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ దుయ్యబట్టారు. సీబీఐ మోదీ జేబు సంస్థ అని విమర్శిస్తూ అదే ఏజెన్సీకి విచారణ బాధ్యతలు అప్పగించడంలో మర్మమేంటని ప్రశ్నించారు.