కొత్తగూడెం టౌన్/పాల్వంచ/చుంచుపల్లి, జూన్ 8 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంతోపాటు చుంచుపల్లి, పాల్వంచ పట్టణంలో శనివారం ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో వాహనదారులు, పాదచారులు, వ్యాపారులు ఇబ్బందిపడ్డారు.