హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : వాయువ్య బంగాళాఖాతంలో పూరి వద్ద తీరం దాటిన వాయుగుండం మంగళవారం ఉత్తర ఛత్తీస్‌గఢ్ వద్ద కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. గడిచిన 24 గంటల్లో ములుగు, కుమ్రంభీం-ఆసిఫాబాద్, జయశంకర్-భూపాలపల్లి, భద్రాద్రి-కొత్తగూడెం, పెద్దపల్లి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసినట్టు వెల్లడించింది.
ములుగు జిల్లా ఏటూరు నాగారంలో అత్యధికంగా 5.12 సెం.మీ, కన్నాయిగూడెంలో 2.81 సెం.మీ, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో 4.98 సెం.మీ, చింతలమానెపల్లిలో 4.91 సెం.మీ, బెజ్జూర్‌లో 4.29 సెం.మీ, పెంచికల్‌పేటలో 3.20 సెం.మీ, జయశంకర్భూపాలపల్లి జిల్లా మలిమెలలో 4.35 సెం.మీ, పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో 2.84 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్టు పేర్కొంది.