ముషీరాబాద్, మార్చి 1: కాంగ్రెస్, బీజేపీ ఓటుబ్యాంకు రాజకీయాల వల్లే ఎస్సీ వర్గీకరణ జాప్యం జరుగుతున్నదని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ విమర్శించారు. హైదరాబాద్లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో బుధవారం జరిగిన మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఆయన పాల్గొని,మాట్లాడుతూ 23 ఏం డ్ల దండోరా ఉద్యమంలో 18 మంది మాదిగ బిడ్డ లు ప్రాణాలర్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక, కుల, వర్గ ఉద్యమాలకు దండోరా సం స్థ మాతృసంస్థగా నిలిచిందని, అమరుల ఆశయమైన వర్గీకరణను సాధించే వరకు తమ ఉద్యమా న్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.